మేకప్ తీసేసాను...చూసారా ఎలా ఉన్నానో
on Dec 6, 2024
ఆట సందీప్ వైఫ్ జ్యోతి రాజ్ గురించి అందరికీ తెలుసు. ఆమె కూడా డాన్సర్ ..ఆట సందీప్ తో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరూ కలిసి రకరకాల షోస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. జ్యోతి రాజ్‌పై ఈమధ్య బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు కొంతమంది నెటిజన్స్..మీది నాచురల్ బ్యూటీ కాదు. మీరు అందంగా ఉండరు అంటూ ఇలా అన్నమాట. ఐతే జ్యోతి దీని మీద ఒక వీడియో చేసింది. వీడియోలోనే తన మేకప్ ని తీసేస్తూ అలాగే ఫేస్ మొత్తాన్ని రబ్ చేస్తూ చూసారా..మేకప్ లేకుండా చూడలేము అన్న వాళ్ళ కోసమే ఈ వీడియో. పర్లేదు..కొంచెం బాగుంటాను కాబట్టే మా ఆయన చేసుకున్నాడు. కొంచెం అంతో ఇంతో పర్లేదు.
యావరేజ్ గా ఉంటాను అందరూ అంటున్నట్టు మరీ ఘోరంగా ఉండను. చూసారు మేకప్ లేకుండా ఫిల్టర్ కూడా లేకుండా ఎలా ఉన్నానో అంటూ తన ఫేస్ ని చూపించింది. ఇది చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. "మా డాన్స్ మాస్టర్ సెలక్షన్ అద్భుతంగా ఉంటది మా మాస్టర్ గారి సెలక్షన్ సూపర్ ...మీరు ఏ లెవెల్ లో ఉంటారో మా మాస్టర్ కి తెలుసు మిగతా వాళ్ళకి అవసరం లేదు.. మీ మనసు మంచిది మీకు ఏ మేకప్ అవసరం లేదు. యావరేజ్ ఫేస్ కాదు నాచురల్ అండ్ పాజిటివ్ ఫేస్ మీది. మీరు యావరేజ్ కాదండి ట్రెడిషనల్ గా చాలా బాగున్నారు. నిజం చెప్పాలంటే ఇలాగే మీరూ చాలా అందంగా వున్నారు.." అంటూ జ్యోతిరాజ్ కి బూస్ట్ ఇస్తూ కామెంట్స్ పెట్టారు.
Also Read